పెదపాడు మండలంలో పంట నష్టా నమోదును పరిశీలించిన జాయింట్ కలెక్టర్ .

ఏలూరు, సెప్టెంబరు, 9… వరదలు, భారీ వర్షాలు మూలంగా నమోదు చేస్తున్న పంట నష్ట అంచనాల వివరాలను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆదేశించారు.
సోమవారం పెదపాడు మండలం సత్యవోలు, నాయుడుగూడెంలలో పంట నష్టం నమోదు వివరాల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ పంటదెబ్బతిన్న రైతులు ఎవ్వరూ అధైర్యపడోద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భారీ వర్షాలు, వరదలు మూలంగా సేకరిస్తున్న పంట నష్ట అంచనాల వివరాలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సంబంధిత వివరాలు రేపటి సాయంత్రంలోగా ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందన్నారు. పంట నష్టాలను ఏవిధంగా నమోదు చేస్తున్నారో జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఖరీఫ్ ఈ-పంట ఏమేర నమోదైయింది వ్యవసాయశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ బాషా మాట్లాడుతూ ఈ-పంట నమోదులో ఏలూరు జిల్లా రాష్ట్రంలో రెండవ స్ధానంలో ఉందని వివరించారు.
జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ బాషా, అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్బారావు, తహశీల్దారు ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ తదితరులు ఉన్నారు.