Close

ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే “స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మనస్సు పెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి

Publish Date : 15/11/2025

ఏలూరు, నవంబరు 15: జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ప్రాంగణంలో మూడవ శనివారం నిర్వహించే “స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా “వ్యక్తిగత & సమాజ పరిశుభ్రత” అనే థీమ్ తో జిల్లా కలెక్టరేటు ఉద్యోగులు, విద్యార్థిని, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, గోదావరి వనంలో పూల మొక్కను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నాటారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల వ్యాధులకు దూరం కావచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని, పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి రోజులలో మొక్కలను నాటి వాటిని పరిరక్షించడం ఒక అభిరుచిగా చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రతి నెల మూడవ శనివారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రభుత్వ యేతర సంస్థలలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా పాటించడం జరుగుచున్నదని అన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు “వ్యక్తిగత & సమాజ పరిశుభ్రత” థీమ్ తో జిల్లా అంతటా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మన ఇంటితోపాటు చుట్టు ప్రక్కల పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. బహిరంగ మూత్రవిసర్జన, మలవిసర్జన నివారణకు అవగాహన కల్పించడం, నవసమాజం నిర్మాణం కోసం పారిశుధ్యం ప్రోత్సహించడానికి దృష్టి సారించాలన్నారు. అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర అమలు అయ్యేవిధంగా చూడాలని అన్నారు. పబ్లిక్ టాయిలెట్లు, బస్టాండ్లలో,సామూహిక టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచుకోవలసిన ఆవశ్యకతను వివరించడంతో పాటు, పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలలు నందు ఋతు పరిశుభ్రత నిర్వహణ మరియు సురక్షితమైన పారిశుధ్య పద్ధతులపై అవగాహనకు ప్రత్యేక డ్రైవ్‌ లు నిర్వహించాలన్నారు. కమ్యూనిటీ టాయిలెట్లు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు చుట్టూ పరిశుభ్రత డ్రైవ్‌లను నిర్వహించాలని సూచించారు. సామూహిక మరుగుదొడ్ల అవగాహన, నిర్వహణ కోసం స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద, సేవా సంస్థలను భాగస్వామ్యులను చెయ్యాలని అన్నారు. పట్టణ, గ్రామీణ మంచినీటి సరఫరా పరిశుభ్రతపై తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, కర్రీపాయింట్లు, ఫుడ్ తోపుడు బండ్లు, తదితర విక్రయ శాలలు వద్ద పరిశుభ్రత .పాటించేలా చూడాలన్నారు. ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని, చేతికి తప్పనిసరిగా గ్లౌజులు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. శీతాకాలం సీజన్లో అంటూ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, పరిపాలన అధికారి నాంచారయ్య, సెట్ వేల్ సిఇవో కె.యస్.ప్రభాకర రావు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, ఉద్యోగులు, జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బి.బెన్నీ, సభ్యులు యం.చంద్రశేఖర రావు, రెడ్ క్రాస్ కమిటీ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.