ప్రధానమంత్రి కుసుమ్ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ పనులు పూర్తిఅయ్యాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కు తెలియజేసారు.

ఏలూరు, ఆగష్టు, 28 : ప్రధానమంత్రి కుసుమ్ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ పనులు పూర్తిఅయ్యాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కు తెలియజేసారు.
ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం సాయంత్రం ఎంఐ ట్యాంకులు & గ్రౌండ్ వాటర్, పీఎం- కుసుమ్ కు సంబంధించిన భూ సమస్యలు, పెన్షన్లు, సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్, యూరియా లభ్యత & ధర నిర్ణయం, జిల్లా జువెనైల్ జస్టిస్ కమిటీల ఏర్పాటు & అమలు, భారత వైమానిక దళంపై సమస్యలు, అన్న క్యాంటీన్ల నిర్వహణ, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతోరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ,జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి కుసుమ్ పధకంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుచేసేందుకు 78 ఎకరాల భూమి సేకరణ పూర్తిచేశామని, సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులు ప్రతీ ఒక్కరికీ పెన్షన్లు అందిస్తామని గ్రామ స్థాయిలో తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో యూరియా ఎరువులకు ఎటువంటి కొరతా లేదని, రైతులందరికీ యూరియా లభ్యతపై అవగాహన కలిగించాలన్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని, ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా అల్పాహారం, భోజనం నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా అందించాలని, అన్నా క్యాంటీన్ల లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లాపరిషత్ సీఈఓ శ్రీహరి, డిఆర్డిఏ , డ్వామా పీడీ లు ఆర్. విజయరాజు, సుబ్బారావు, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, సిపిఒ వాసుదేవరావు, డిపిఓ కె. అనురాధ, డిఎంహెచ్ఓ డా. పి .జె. అమృతం, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, ఇరిగేషన్ ఎస్ఈ దేవప్రకాష్, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు,, ప్రభృతులు పాల్గొన్నారు.