Close

భక్త కనకదాసు జీవితం మనందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Publish Date : 09/11/2025

ఏలూరు, నవంబర్ 9: భక్త కనకదాసు జీవితం మనందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త కనకదాసు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భక్త కనకదాసు విశిష్టమైన కవి గా, తత్త్వవేత్తగా, గొప్ప సామజిక సంస్కర్తగా పేరుగాంచారని, ఆయన రచనలు, కీర్తనలు ప్రజలకు భక్తిని మానవత్వాన్ని బోధించాయాన్నారు. భక్త కనకదాసు బోధనలు మానవతా విలువలకు ప్రతీకగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఆర్.వి నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత,
డి .అశోక్ కుమార్, గోపాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.