Close

భారీవర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Publish Date : 18/07/2024

ఏలూరు, జూలై, 18 : వాతావరణశాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపద్యంలో జిల్లాలో వరదల వల్ల ఎటువంటి ప్రాణనష్టం, ఆస్ధినష్టం కలుగకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం స్ధానిక శనివారపుపేట, తమ్మిలేరు కాలువ లోబ్రిడ్జివద్ద ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్, నగరపాలక సంస్ధ అధికారులతో కలసి కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లాలో వాతావరణ శాఖ భారీ వర్షాలు హెచ్చరికలు సంబంధిత అధికారులు అప్రమత్తమై ప్రాణనష్టం, ఆస్ధినష్టం జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో తమ్మిలేరు వరదలను దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపట్టాలని తెలిపారు. తమ్మిలేరు రిజర్వాయర్ లో నీటిసామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తమ్మిలేరు కాలువకు సంబంధించి ఏలూరులో మూడు పాయింట్లు వద్ద సంబంధిత అధికారులు 24 గంటలు పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి ముందుగానే హెచ్చరికలను జారీచేయవల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఏలూరులోని తమ్మిలేరు వరద ఉధృతి ప్రాంతాలైన ఇందిరమ్మ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, సాయినగర్ లోని కాల్వల పరిస్ధితులను అడిగితెలుసుకున్నారు. తమ్మిలేరు కాలువ రిటర్నింగ్ వాల్, లోబ్రిడ్జీలపై ట్రాఫిక్ నియంత్రణ, బండ్ ఏరియా, బ్రీచ్ తదితర అంశాలను గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డివోఎన్ఎస్ కె ఖాజావలి, ఇరిగేషన్ అధికారులు ఇఇ దేవప్రకాష్, డిఇ అర్జున్, నగరపాలక సంస్ధ కమీ