మొంథా తుఫాన్ సహాయక చర్యలపై ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లు, తుఫాన్ సహాయక కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఏలూరు, అక్టోబర్, 27 : మొంథా తుఫాన్ సహాయక చర్యలపై ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లు, తుఫాన్ సహాయక కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తుఫాన్ వల్ల ఎవరూ ప్రమాదాలబారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. తుఫాన్లను ఎదుర్కొనేందుకూ పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు జరపాలని సీఎం చెప్పారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు తుఫాన్ పర్యవేక్షణ జోనల్ ప్రత్యేక అధికారి ఆర్. పి . సిసోడియా, ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి మరియు తుఫాన్ పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ తదితర అధికారులు పాల్గొన్నారు