Close

రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతీ ఒక్కరూ రక్తదానమునకు ముందుకు రావాలని జిల్లా కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు.

Publish Date : 07/04/2025

ఏలూరు, ఏప్రిల్, 7 : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతీ ఒక్కరూ రక్తదానమునకు ముందుకు రావాలని జిల్లా కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లో సోమవారం రక్తదాన శిబిరాన్ని జ్యోతి వెలిగించి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు రక్తం ఎంతో అవసరమవుతుందని, దాతల నుండి సేకరించిన రక్తాన్ని వారికి అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ వారి పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సమయాలలో రక్తదానం చేయడం ఒక అలవాటుగా చేసుకోవాలన్నారు. రక్తదాన శిబిరానికి రక్తదానం చేసేందుకు వందలాది మంది యువకులు రావడం అభినందనీయమన్నారు. ఒకరి రక్తదానం ద్వారా 6 గురి వ్యక్తులను ప్రాణాపాయం నుండి కాపాడవచ్చన్నారు. రక్తం నుండి ప్లాస్మా, ప్లేట్ లెట్లు, ఎర్ర,తెల్ల రక్త కణాలు వంటి కంపోనెంట్లు అందించవచ్చన్నారు.
జిల్లా సహకార అధికారి ఏ . శ్రీనివాస్ మాట్లాడుతూ 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి “అంతర్జాతీయ సహకార సంవత్సరం”గా ప్రకటించిందని, ఈ కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు.
కార్యక్రమంలో డా. ప్రసాదరావు, డిసిఎంఎస్ బిఎం వి. ఎస్. కృష్ణమోహన్, సిబ్బంది సుధాకరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.