Close

రహదారి ప్రమాదాలలో ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి

Publish Date : 06/05/2025

ఏలూరు, మే, 6: రహదారి ప్రమాదాలలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకుండా ప్రయాణాలు సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం అనంతరం పాత్రికేయులతో మంత్రి పార్థసారథి మాట్లాడుతూఆదేశించామన్నారు. ఏలూరు జిల్లాలో అతి పొడవైన జాతీయ రహదారి నిడివి ఉన్నదన్నారు. హైవే పై రోడ్డు డిజైన్ లోపం కారణంగా కొన్ని ప్రాంతాలలో వాహనాలు కంట్రోల్ తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని సరిచేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హైవే అధికారులను మంత్రి ఆదేశించారు. జాతీయ రహదారిపై కొన్ని ప్రాంతాలలో అవసరం ఉన్నా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయలేదని, దీని కారణంగా ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవసరమైన ప్రదేశాలలో సర్వీస్ రోడ్లు ఏర్పాటుచేసేలా హైవే అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారుల సంస్థతో సంప్రతించి గుండుగొలను వద్ద రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు మంజూరు చేయించారని, అవి త్వరలో పూర్తి అవుతాయన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రమాదాలు నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. అతివేగం కారణంగా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయని, జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను స్పీడ్ గన్స్ (కెమెరాలతో) గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. హెల్మెట్స్, సీట్ బెల్ట్ లు అసౌకర్యంగా భావించకుండా వాహనాలు నడిపే ప్రతీ ధరించాలన్నారు. జాతీయ రహదారిపై ఏర్పాటుచేసే దాభా , హోటల్స్ నిబంధనల మేరకు పార్కింగ్ సౌకర్యం వంటి ఉన్నవారు అనుమతి తీసుకుని ఏర్పాటుచేయాలని, నిబంధనల మేరకు లేని హోటల్స్ పై చర్యలు తీసుకోవాలన్నారు. వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మంత్రి పార్థసారథి చెప్పారు.

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే లు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ప్రభృతులు పాల్గొన్నారు.