రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం కలెక్టరేట్ లో జిల్లాలోని శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, అధికారులతో జిలాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు .
ఏలూరు, మార్చి , 17 : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం కలెక్టరేట్ లో జిల్లాలోని శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, అధికారులతో జిలాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు . జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నిలిపేందుకు అవసరమైన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై చర్చించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోనికి మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలు, ప్రభుత్వ సేవలపట్ల ప్రజలకు మరింత మేలు జరిగేలా, ప్రజల సంతృప్తి స్థాయి మరింత పెంచేందుకు తీసుకోవలసిన చర్యలు, జిల్లాలో పాపికొండలు ప్రాంతంలో పర్యాటకాభివృద్ధి, ముఖ్యంగా టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు, జిలాల్లో ప్రజల సంతృప్తి స్థాయి తక్కువగా ఉన్న ప్రభుత్వ సేవల విభాగంలో ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచడంపై తీసుకోవలసిన చర్యలు, రైతాంగానికి అవసరమైన సాగునీటికి సంబంధించి పంట కాల్వలు మరమ్మత్తులు, తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, డా. కామినేని శ్రీనివాస్, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ మందలపు రవి, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, ప్రభృతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ కు విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పూలమొక్కను అందించి స్వాగతం పలికారు.