రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబాబునాయుడు ఈ నెల 11వ తేదీన నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్న దృష్ట్యా పర్యటన ఏర్పాట్లను శనివారం ఆగిరిపల్లిలో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు.

అగిరిపల్లి, ఏప్రిల్, 5 : రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబాబునాయుడు ఈ నెల 11వ తేదీన నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్న దృష్ట్యా పర్యటన ఏర్పాట్లను శనివారం ఆగిరిపల్లిలో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. అగిరిపల్లి శివారు వడ్లమానులో హెలిప్యాడు, బహిరంగ సభకు సంబందించి అధికారులు ప్రతిపాదించిన ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు. హెలిప్యాడ్ కు ప్రతిపాదించిన స్థలంలో హెలికాప్టర్ లాండింగ్ అయ్యేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించాలని, పరిసర ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా ఉండేలా స్థలాన్ని గుర్తించాలన్నారు. హెలీప్యాడ్ నుండి బహిరంగ సభకు తక్కువ దూరం ఉండేలా చూడాలన్నారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజల సంఖ్య ననుసరించి అంత సామర్ధ్యం కలిగిన ప్రదేశాన్ని గుర్తించాలన్నారు. వేసవి దృష్ట్యా బహిరంగ ప్రదేశంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, హాజరయ్యే ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. హెలీప్యాడ్ , బహిరంగ సభ నిర్వహించనున్న ప్రదేశాలు భద్రతా పరంగా అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు.
కలెక్టర్ వెంట నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, తహసీల్దార్ పి .ఎన్ .వి. ప్రసాద్, ఎంపిడిఓ బి. ఆనందరావు, అగిరిపల్లి సర్పంచ్ చౌటపల్లి లక్ష్మి, వడ్లమాను సర్పంచ్ జలసూత్రం లక్ష్మి, కుమారి, స్థానిక నాయకులు నెరుసు సతీష్, మాధల సత్యకుమార్, చిట్నేని శివరామకృష్ణ, ప్రజాప్రతినిధులు, , ప్రభృతులు పాల్గొన్నారు.