• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ

Publish Date : 02/05/2025

ఏలూరు, మే, 1 : మే, 2 వ తేదీన రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు శ్రీకాకుళం, అల్లూరిసీతారామరాజు మన్యం, జిల్లా, విజయనగరం, తదితర జిల్లాల నుండి గురువారం రాత్రికి ఏలూరుకు విచ్చేస్తున్న ప్రజలు, ప్రజాప్రతినిధులకు అవసరమైన భోజన, వసతి సదుపాయాలకు ఎటువంటి లోటులేకుండా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం ఏలూరులోని అమీనాపేటలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, పెదపాడు మండలం వట్లూరులోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాల, మరియు ఏలూరులోని పలు పాఠశాలలు, వసతి గృహాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో కలిసి పరిశీలించారు. సుదూర ప్రాంతాల నుండి అమరావతి వెళ్లే ప్రజలు, ప్రజాప్రతినిధులను ముందురోజు ఏలూరు లో రాత్రిబస అనంతరం, శుక్రవారం ఉదయమే అమరావతికి బయలుదేరి వెళతారని, వారికి గురువారం వసతి, భోజన సదుపాయాలతోపాటు, శుక్రవారం ఉదయం అల్పాహారం అందించి పంపడం జరుగుతుందన్నారు. వారు బస చేసే ప్రదేశాలలో ఫ్యాన్లు, త్రాగునీరు, టాయిలెట్ల సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ వెంట డీఈఓ వెంకటలక్ష్మమ్మ , జిల్లా మైనారిటీస్ సంక్షేమాదికారి కృపావరం, సెట్వెల్ మేనేజర్ ప్రభాకర్, ఏలూరు అర్బన్, రూరల్, పెదపాడు, తహసీల్దార్లు శేషగిరి, శ్రీనివాస్, ఏ. కృష్ణజ్యోతి, ప్రభృతులు పాల్గొన్నారు.