లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి

ఏలూరు,మే 04 : లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించారని జిల్లా కలెక్టర్ కె . వెట్రీసెల్వి పేర్కొన్నారు.
ఆదివారం ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రీసెల్వి మాట్లాడుతూ నీటిని దివి నుంచి భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని అన్నారు. ఆమహనీయుడును స్మరించుకోవడం, జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. మహనీయుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం భగీరథ మహా మహర్షి వేడుకలను నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, సహాయ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ టి.వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య,కలెక్టరేట్,బి సి సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.