Close

విభిన్న ప్రతిభావంతుల సమస్యలను మానవతా దృక్పధంతో పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.

Publish Date : 12/11/2025

ఏలూరు, నవంబర్, 12 : విభిన్న ప్రతిభావంతుల సమస్యలను మానవతా దృక్పధంతో పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు, వారి సమస్యల తెలుసుకుని పరిష్కరించేందుకు డివిజన్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వారికి వృత్తిపరమైన నైపుణ్యం ప్రత్యేక శిక్ష ఇచ్చి, వారికోసం ప్రత్యేక జాబ్ మేళా లు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అందించే ఉపకరణాలను అర్హులైన వారికి అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సదరం రీ వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
ఈ సందర్భంగా విభిన్నప్రతిభావంతులు తెలియజేసిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బముగా విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలపై ముద్రించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి రామ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.జె. అమృతం, జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి డా. పాల్ సతీష్, డి.ఆర్. డి. ఏ ., పీడీ ఆర్. విజయరాజు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, ఐ సి డి ఎస్ పీడీ శారద, ఎల్ డి ఎం. నీలాద్రి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ ప్రతినిధులు వీరభద్రరావు, రాధారాణి , జి. ప్రవీణ్ వర్మ, వి. యుగంధర్, సిహెచ్. జాకోబ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.