వైభవంగా ఉగాది కవి సమ్మేళనం అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు

ఏలూరు,మార్చి,30:విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు సందర్భంగా ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 62 సంవత్సరాలు పైబడి వయసు కలిగిన 3 అర్చకులు, ఒక వేద పండితుడికి నగదు పురస్కారాలు అందించారు. ముదినేపల్లి మండలం మండవల్లి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అర్చకులు గూడూరు శ్రీనివాసరావు, ఏలూరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం కందుకూరి రామ బ్రహ్మానందం, ముసునూరు శ్రీ వెంకటాచల స్వామి వారి దేవస్థానం అర్చకులు వేదాంతం లక్ష్మీనరసింహాచార్యులు, కైకలూరు మండలం శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం సప్త శతీ పారాయణదారు వెంకట నాగ శ్రీధర్ శాస్త్ర లనునగదు పురస్కారాలతో జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంట పద్మశ్రీ ఘనంగా సత్కరించారు.
వ్యవసాయ ఉద్యాన శాఖలో ఆదర్శ రైతులు ఆడం మిల్లికి చెందిన మలకపల్లి వీరరాఘవయ్య, కొయ్యలగూడెం చెందిన మద్దుకూరి కృష్ణ, దెందులూరు మండలం సీతంపేటకు చెందిన పర్వతనేని రామకృష్ణ, పెదవేగి మండలం లక్ష్మీపురం లో ఆర్గానిక్ ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న ఉప్పలపాటి చక్రపాణి, పెదవేగి మండలం రాట్నాలకుంట లో కొబ్బరి కోకో సాగు చేస్తున్న సింహాద్రి గోపాలకృష్ణ లను జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి,జడ్పీ చైర్ పర్సన్ ఘంట పద్మశ్రీ శాలువా పూలదండలతో సత్కరించి జ్ఞాపిక ప్రశంసా పత్రాలను అందజేశారు.
పౌరాణిక సాంఘిక సంగీతం గాయనీ గాయకులకు, పెయింటింగ్ రంగాల్లో బోడ్డేపల్లి అప్పారావు, షేక్ మహబూబ్ సుభాని, వి. రామాంజనేయులు, పూనెం జయ సాయి శ్రీను, టి రమ్యకృష్ణ, కళ్యాణి, వి. కామరాజు, ఘంటాసాల పెద్దిరాజు, ఎడవల్లి వెంకటరమణ, మాండవ రాజగోపాలకృష్ణ, బి కే బిందు, కామ సోమరాజు (సొమ్ల నాయక్), గండికోట రాజేష్ లను, వ్యాఖ్యాతిగా వ్యవహరించిన ఆర్టీసీ పిఆర్ఓ కె.ఎల్.వి.నరసింహారావు లను శాలువా,పూలమాలతో సత్కరించి జ్ఞాపిక,ప్రశంసా పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఐటీడీఏ పీవో రాములు నాయక్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, సెట్ వెల్ సీఈవో ప్రభాకర్ రావు, డి ఆర్ డి ఏ పి డి ఆర్ విజయ రాజు, సహాయ పర్యాటకశాఖ అధికారి పట్టాభి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.