Close

సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా గోపన్నపాలెంలో ట్రాక్టర్ల తో రైతుల భారీ ర్యాలీ ట్రాక్టర్ ను స్వయంగా నడిపి రైతులలో జోష్ నింపిన జిల్లా కలెక్టర్

Publish Date : 01/10/2025

ఏలూరు, అక్టోబర్, 1 : సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయమ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమం అనంతరం దెందులూరు నియోజకవర్గంలోని రైతులు ట్రాక్టర్ లతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గోపన్నపాలెం నుండి వేగవరం, సోమవరప్పుడు మీదుగా బైపాస్ రోడ్డు లో లక్ష్మీపురం వరకు రైతులు షుమారు 200 ట్రాక్టర్ లతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వ్యవసాయ , అనుబంధ రంగాల అధికారులు, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.