స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ కోసం మండల, జిల్లాస్ధాయి ప్రణాళికలు రూపొందించాలి వ్యవసాయ అనుబంధ, పారిశ్రామిక, పాలఉత్పత్తి, ఆక్వా, తదితర రంగాల్లో విస్తరణ, ఉత్పత్తుల వృద్ధికోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ లో జిల్లాస్ధాయి ప్రణాళిక ప్రస్ఫుటంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో స్వర్ణాంధ్ర @ 2047 మండల, జిల్లాస్ధాయి ప్రణాళిక రూపకల్పనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ వికసిత్ భారత్ నేపద్యంలో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర @2047 లక్ష్యసాధన కోసం మండల, జిల్లాస్ధాయి ప్రణాళికలు అందజేయవలసివుందన్నారు. మండల స్ధాయిలో రూపొందించిన ప్రణాళికలను క్రోడికరించి జిల్లాస్ధాయి ప్రణాళికను అక్టోబరు 15 లోగా ప్రభుత్వానికి అందజేయవల్సివుందన్నారు. ఇందులో భాగంగా రానున్న 5 యేళ్ల కాలంలో 2024 నుండి 2029 వరకు ఒక విజన్ తో కూడిన నివేదిక రూపొందించవలసివుందన్నారు. ఇందుకు జిల్లాలోని ప్రతి శాఖ ఈ లక్ష్యసాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించవలసివుందన్నారు. స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంటేషన్ రూపకల్పనలో భాగంగా సెప్టెంబరు 21 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు నిర్వర్తించవలసిన కార్యాచరణను వివరించారు. పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, జిల్లాస్ధాయి ప్రజాప్రతినిధులతో మరియు బ్యాంకర్లు, రైతులు, వాణిజ్యరంగం, ఇతర అసోషియేషన్లు, తదితరులతోకూడా సమావేశాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. స్వర్ణాంధ్ర @2047 ప్రాముఖ్యతపై పాఠశాల, ఇంటర్మీడియేట్ తదితర కళాశాలల స్ధాయిలో వక్తృత్వ క్విజ్ పోటీలు, చర్చాగోష్టులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధంగా గ్రామ పంచాయితీ స్ధాయిలో గ్రామ సభలు కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలన్నారు. తద్వార ప్రణాళికలో ప్రజల సూచనలు, సలహాలను స్వీకరించాలన్నారు. వ్యవసాయ, ఉధ్యాన, మత్స్య రంగాల్లో ప్రస్తుత విస్తరణ , దిగుబడులు, రానున్న రోజుల్లో అంతర సాగు విధానం, ఆదాయం పెంపు, ప్రకృతిసాగు విస్తీర్ణ పెంపు, తదితర అంశాలను ప్రణాళికలో పొందుపరచవలసివుందన్నారు. పాల ఉత్పత్తి పెంపుదలకు అవసరమైన అంశాలను ప్రణాళికలో పొందుపరచాలన్నారు. పారిశ్రామిక, పర్యాటక రంగ, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల స్ధాపన, వంటి అంశాలను ప్రణాళికలో జోడించాలన్నారు.
సమావేశంలో డిఎఫ్ఓలు రవీంధ్రదామా, రవిశంకర్, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, డ్వామా పిడి ఎ. రాము, డిపివో టి. శ్రీనివాస్ విశ్వనాధ్, ఉధ్యానశాఖ డిడి రామ్మోహన్, ఎల్ డిఎం డి. నీలాధ్రి, పశుసంవర్ధకశాఖ జెడి జి. నెహ్రూబాబు, డిఎంహెచ్ఓ డా. ఎస్. శర్మిష్ట, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, ఎపిఎంఐపి పిడి రవికుమార్, మున్సిపల్ కమీషనరు ఎన్. భానుప్రతాప్, మత్స్యశాఖ జెడి నాగలింగాచారి, సిపివో బి. శ్రీదేవి, డిఇఓ ఎస్. అబ్రహాం, డివైఇవో ప్రభాకరరావు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. బాబ్జి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.