Close

అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ సంబరాలు ఆకట్టుకున్న విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

Publish Date : 26/01/2025

ఏలూరు, జనవరి, 26 : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం జిల్లా విద్యాశాఖ ఆద్వర్యంలో పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తిని ప్రభోదించే రీతిలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఏలూరులోని అక్షర పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన “వందేమాతరం …..” అంటూ దేశ సమైక్యత పై ప్రదర్శించిన నృత్య కార్యక్రమం ఆకట్టుకుంది. కలిదిండికి చెందిన కలిదిండి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు
చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ” జై భోలో… జై భోలో.. భరతమాతకు జై భోలో..” అనే దేశభక్తి గీతంతో ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆలరించింది. తెల్లంవారిగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంప్రదాయ ” లెయో … లయారే” అంటూ ప్రదర్శించిన గిరిజన సాంప్రదాయ నృత్యం ఆహూతులను అలరించింది. సమాజంలో మహిళలపై రోజురోజుకీ పెరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాలను, సామజిక సవాళ్ళను ఎదుర్కొనేలా వారిలో ఆత్మస్థైర్యం నింపేలా ఆత్మరక్షణకు విద్యలను నేర్పుతున్నామంటూ వారి పాఠశాలలో విద్యార్థినులకు నేర్పుతున్న ఆత్మరక్షణకు కర్ర సాము, కరాటే వంటి వాటిలో శిక్షణ అందిస్తూ విన్నూత్నంగా ఏలూరుకు చెందిన కస్తూరిబా బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు “జయహో.. జయహో..” అంటూ చేసిన ప్రదర్శనకు సభికులందరూ కరతాళధ్వనులు చేశారు. ఏలూరుకు చెందిన సర్ సి.ఆర్. రెడ్డి పబ్లిక్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు “కుచ్ కరియే… కుచ్ కరియె”. అంటూ వ్యాయమ క్రీడలతో చేసిన ప్రదర్సన ఆకట్టుకుంది. నూజివీడుకు చెందిన త్రివేది ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు “వందేమాతరం” అంటూ చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. చివరిగా ఏలూరుకు చెందిన సెయింట్ థెరెసా మహిళా కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన “తయం ..త. తయం ..” అంటూ చేసిన ప్రదర్శన సభికులను అలరించింది.
బహుమతులు పొందిన ప్రదర్శనలు
వీటిలో ఏలూరుకు చెందిన కస్తూరిబా నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినుల ప్రదర్శనకు మొదటి బహుమతి, తెల్లంవారిగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ప్రదర్శన, సెయింట్ థెరెసా విద్యార్థినులు ప్రదర్శనలకు ద్వితీయ బహుమతి , కలిదిండి కి చెందిన కలిదిండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థినీ, విద్యార్థుల ప్రదర్శన, అక్షర పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలకు తృతీయ బహుమతి, సర్, సి.ఆర్. రెడ్డి పబ్లిక్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థుల ప్రదర్శనకు కన్సోలేషన్ బహుమతి లభించాయి. బృందాలకు మెమొంటోలను కలెక్టర్, ఎస్పీ లు అందించారు.
కార్యక్రమంలో డి ఎఫ్. ఓ శుభకరణ్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, డా. కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా రెవిన్యూ అధికారి . వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.