Close

అక్టోబర్ 1వ తేదీన 2 లక్షల 60 వేల 765 మంది పెన్షన్ దార్లకు 114. 14 కోట్ల రూపాయలు పెన్షన్ల పంపిణీ

Publish Date : 30/09/2025

ఏలూరు, సెప్టెంబర్, 30 : జిల్లాలో అక్టోబర్,1వ తేదీన సామజిక పెన్షన్ల పంపిణీ ఉదయం 7 గంటల నుండి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. జిల్లావ్యాప్తంగా 2 లక్షల 60 వేల 765 మంది పెన్షన్ దార్లకు 114. 14 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 1వ తేదీనే నూరు శాతం పెన్షన్ దారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని, అనివార్య కారణాలచేత 1వ తేదీన తీసుకొని వారికి 3వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 5175 మంది సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ పొందేవారికి వారి సంబంధిత ఇళ్లల్లో అందుబాటులో ఉండాలని ముందుగానే సమాచారం అందించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు.