అటవీ పర్యావరణ సమతుల్యతను కాపాడే కీలక జీవి పులి అని, ప్రపంచ పులుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి చెప్పారు.
ఏలూరు, జూలై , 29 : అటవీ పర్యావరణ సమతుల్యతను కాపాడే కీలక జీవి పులి అని, ప్రపంచ పులుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి చెప్పారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఏలూరు మండలం కొప్పాక గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పర్యావరణ సమతుల్యతను – పులుల సంరక్షణ అనే అంశంపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డిఎఫ్ఓ సందీప్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత, జీవవైవిద్యానికి పులులు ఎంతగానో ప్రధానమైనవన్నారు. పులుల సంరక్షణ అవసరాన్ని ప్రపంచానికి తెలియజేయడం, వాటి సంఖ్యను పెంపొందించడం మరియు సహజ నివాసాలను రక్షించడం ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ ప్రాధాన్యతను గుర్తించి 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన పులుల సదస్సులో 13 దేశాలు కలిసి ఈ దినోత్సవాన్ని ప్రకటించాయన్నారు. పులి భారతదేశపు జాతీయ జంతువు మాత్రమే కాకుండా, అటవీ పర్యావరణ సమతుల్యతను కాపాడే కీలక జీవి. ఇది ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉండే మృగం (Top Predator) కావడం వల్ల అడవుల్లో జీవ వైవిధ్యాన్ని సమతుల్యంలో ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని,. పులులు ఉన్న అడవులు ఆరోగ్యకరమైన పర్యావరణానికి సూచికలుగా భావించబడుతున్నాయన్నారు. “పులిని కాపాడితే – ప్రకృతిని కాపాడినట్టే!” నని, 2026-థీమ్ / నినాదం: “స్థానిక గిరిజనులు మరియు స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తూ పులుల భవిష్యత్తును సురక్షితం చేయడం” అని సందీప్ రెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా అటవీ అధికారులు పులుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అడవి జీవుల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో అటవీ శాఖాధికారులు కె.ఎస్.వి. హరి గోపాల్, రామతులసి, సుజాత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రామకృష్ణ, పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.