Close

అటవీ భూములు మరియు అటవీ-వంటి ప్రాంతాలను గుర్తించి, డిజిటైజ్ చేసి, జియో-రిఫరెన్స్ చేయడం, నోటిఫైడ్ అడవులు తదితర అంశాలపై రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి. జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జిల్లా అటవీ శాఖా

Publish Date : 01/06/2026

అటవీ భూములు మరియు అటవీ-వంటి ప్రాంతాలను గుర్తించి, డిజిటైజ్ చేసి, జియో-రిఫరెన్స్ చేయడం, నోటిఫైడ్ అడవులు తదితర అంశాలపై రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి. జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జిల్లా అటవీ శాఖాధికారులతో సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అన్-నోటిఫైడ్ అడవులు, ఆక్రమణలు, RoFR ప్రాంతాలు, క్షీణించిన మరియు చెట్లు లేని భూములు, మరియు ప్రభుత్వ అలాగే ప్రైవేట్ తోటల పెంపకంపై డేటా సేకరణ, ప్రభుత్వ రికార్డులతో సహా ప్రభుత్వ రికార్డులలో అడవులుగా నమోదు చేయబడిన భూములు, గెజిట్ నోటిఫికేషన్లు, బ్లాక్ మ్యాప్‌లు మరియు KML లేయర్‌లను ఉపయోగించి అటవీ బ్లాక్‌ల డిజిటైజేషన్ మరియు జియో-రిఫరెన్సింగ్‌తో పాటు, క్షేత్రస్థాయి ధృవీకరణ, తదితర అంశాలపై కలెక్టర్లు, డిఎఫ్ఓ లతో సమీక్షించారు.
ఏలూరు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా అటవీ శాఖాధికారులు పాల్గొన్నారు.