అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం, ఎస్పీ కె. కిషోర్ వారి యొక్క ఆదేశాల మేరకు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్, ఏలూరు ఆర్డీఓ యం. అచ్యుత అంబరీష్ ప్రజలకు సూచించారు.
👉ఈ అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు నష్టం జరగకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.
👉 నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
👉 ఎలాంటి ఆపద వచ్చినా లేదా సహాయం కావాలన్నా, వెంటనే డయల్ 112కు కాల్ చేయాలని అధికారులు కోరారు.
👉తమ్మీలేరు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు తగిన జాగ్రత్తలను వివరించి, ప్రస్తుతం ఉన్న నివాసాలను వెంటనే ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించారు.
👉ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ అధికారులకు సహకరించాలని, ప్రభుత్వం మరియు అధికారుల సూచనలను పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు.
👉నాగిరెడ్డి డ్యామ్ నుంచి 6,000 క్యూసెక్కుల నీరు విడుదల.
లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి.
👉అత్యవసర సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయండి.
ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ప్రజల రక్షణకు పూర్తిగా సిద్ధంగా ఉంది.
👉ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీస్ మరియు రెవెన్యూ అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.