అసంపూర్తి గృహ నిర్మాణాల పూర్తికి చర్యలు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు,మార్చి 13 : మండలాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న గృహ నిర్మాణాల్లో అసంపూర్తి గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు.
స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం సబ్ కలెక్టర్లు, రెవిన్యూ అధికారులతో గృహ నిర్మాణ అంశంపై కలెక్టర్ టేలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
పిఎంఏవై 1.0 కింద ఇల్లు మంజూరై వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న బీసి, ఎస్సి, ఎస్టీలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్థిక సహాయం అందిస్తుందన్న సంగతిని లబ్దిదారులకు వివరించి, త్వరితగతిన పూర్తిచేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో దాదాపు 49,436 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాలు వివిధ దశలలో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. బి.సి. లు 27,150, ఎస్సీలు 18,452, ఎస్టీలు 3,293, పివిటిజిలు(ఆదివాసి గిరిజనులు) 541 మంది, లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. గృహనిర్మాణం పూర్తికి యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలు, బీసీలు అందరికీ రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పివిటిజి(ఆదివాసి గిరిజనులకు) లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తుందని తెలిపారు. అయితే వీటి నిర్మాణాలను ఏప్రిల్ 2025 లోగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. నిర్మాణం పూర్తి చేసుకొనే దశల వారీగా అదనపు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాకు నేరుగా జమ చేస్తారన్నారు. ఈ మేరకు లబ్ధిదారులు ఇల్లు పూర్తి చేసుకోవడానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ జి.సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు. అలాగే గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమెనిటిస్, ఎంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు ఈ విషయాన్ని విసృతంగా ప్రచారం చేసి లబ్దిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్యయంతో కృషి చేయాలన్నారు.
సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్,ఆర్డీవోలు,
జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు,హౌసింగ్ పిడి సత్యనారాయణ,మండల తహశీల్దారు,హౌసింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.