Close

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అర్హులు అయిన పేద కుటుంబముల వారికి సంవత్సరానికి మూడు (3) గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా పంపిణీ చెయ్యడము జరుగుతున్నదనీ జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి తెలిపారు.

Publish Date : 19/01/2025

ఏలూరు,జనవరి 19:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అర్హులు అయిన పేద కుటుంబముల వారికి సంవత్సరానికి మూడు (3) గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా పంపిణీ చెయ్యడము జరుగుతున్నదనీ జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి తెలిపారు.

సదరు ఉచిత గ్యాస్ సిలిండర్ పధకం లొ ఏలూరు జిల్లాలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందుతున్న సిలిండర్లకు తాము చెల్లించిన నగదు మూడు రోజుల్లోపు తమ ఖాతాల్లో జమ అవుతున్నాయని లబ్దిదారులు వ్యక్తం చెయ్యడము జరుగుతున్నది. అదేవిధముగా లబ్దిదారులు దీపం 2 ఉచిత గ్యాస్ పథకం కింద చెల్లించాల్సిన అసలు: బిల్లుకు అదనంగా రూ.80 నుండి రూ.150 వరకు కొన్ని గ్యాస్ ఏజెన్సీల డెలివరీ బాయ్ లు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపద్యములో రెవెన్యూ మరియు పౌరసరఫరాల సిబంది మరియు సదరు గ్యాస్ ఏజెన్సీ సేల్స్ అధికారులతో సమావేశం నిర్వహించి లబ్దిదారులనుంచి వచ్చిన ఫిర్యాదులు రుజువు అయ్యిన యెడల సదరు గ్యాస్ ఏజన్సీల పై తగు చర్యలు తీసుకోనబడునని మరియు అట్టి ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి వారి లైసెన్సులను రద్దు చేయడం జరుగుననీ హెచ్చరించారు.
ఈ పథకం కింద ఏ ఒక్కరూ ఎటువంటి అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ విధముగా కాకుండా లబ్దిదారుల నుండి గ్యాస్ ఏజెన్సీలు అదనంగా డబ్బులు వసూలు చేసినచో 18004256453 టోల్ ఫ్రీ నెంబర్లుకి కాల్ చేసి ఫిర్యాదు. చేయవచ్చును. మరియు ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయము నందు జరుగు ప్రజా ఫిర్యాదుల. పరిష్కార వ్యవస్థ (PGRS) ద్వార కూడా ఫిర్యాదు చెయ్యవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆర్ధికంగా మేలు చేయుటకు ఉద్దేశించిన ఈ పదకం లబ్దిదారులు సక్రమంగా వినియోగించుకోవాలని, ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ గా వినియోగించుట నేరము మరియు బ్లాక్ మార్కెట్లో అమ్ముటకు ఏజన్సీలు పాల్పడరాదని తెలియజేయశారు