ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ఆధారిటీ ఆక్ట్ ను ననుసరించి జిల్లాలోని ఆక్వా చెరువుల వివరాలను నిర్దేశించిన సమయంలోగా ఆన్లైన్ లో నమోదు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మత్స్య శాఖాధికారులను ఆదేశించారు.
ఏలూరు, అక్టోబర్, 14 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ఆధారిటీ ఆక్ట్ ను ననుసరించి జిల్లాలోని ఆక్వా చెరువుల వివరాలను నిర్దేశించిన సమయంలోగా ఆన్లైన్ లో నమోదు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మత్స్య శాఖాధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ సడా ఆక్ట్, ఏ .పి . ఆక్వాకల్చర్ అప్ లో ఆక్వా చెరువుల నమోదు అంశాలపై మత్స్య శాఖాధికారులతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ఆధారిటీ ఆక్ట్ ను ననుసరించి జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం రైతు వారీగా వివరాలు ఆన్లైన్ లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. జిల్లాలో 26 వేల 582 ఆక్వా చెరువులు ఉన్నాయని, వాటికి సంబంధించి చెరువు విస్తీర్ణం, యజమాని పేరు, ఆక్వా సాగు, వినియోగిస్తున్న ఎరువులు, తదితర వివరాలను విలేజ్ ఆక్వాకల్చర్ యాప్ లో నమోదు ప్రక్రియ ను మరింత వేగవంతం చేయాలన్నారు. జిలాల్లో అనుమతి లేకుండా ఎక్కడా ఆక్వా సాగు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నర్సయ్య, మండల స్థాయి మత్స్య అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.