ఆకట్టుకున్న వివిధ ప్రభుత్వశాఖల స్టాల్స్.
ఏలూరు, జనవరి,26: 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా పలు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా డిఆర్డిఏ ఆధ్వర్యంలో 19 వేల 860 సంఘాలకు చెందిన 1,73,054 మంది సభ్యులకు రూ.1268.46 కోట్లు రుణాలను అందజేశారు. ఆదివారం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్బంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, డిఎఫ్ఓ శుభకరణ్, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డిఆర్ ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, తదితరులు సందర్శించారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, రెవెన్యూ (సర్వే),మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా విద్యాశాఖ, మెప్మా, మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖ, ఆర్ డబ్ల్యు ఎస్ జల జీవన్ మిషన్, పరిశ్రమల శాఖ (కార్పెట్ స్టాల్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని ప్రదర్శించారు. ఈ సందర్బంగా డి ఆర్ డి ఎ ఉన్నతి ద్వారా 764 సంఘాలకు రూ. 7.91 కోట్లు, స్త్రీనిధి కింద 3,700 సంఘాలకు రూ.129.30 కోట్లు రుణాలు, బ్యాంకు లింకేజి కింద 15,396 సంఘాలకు రూ.1131.25 కోట్లు రుణాలు చెక్కులను పంపిణీ చేశారు. పలువురు దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు అందజేశారు. ఆధునిక వ్యవసాయ పద్దతులను అవగాహన పర్చే రీతిలో వ్యవసాయ, ఉద్యానశాఖ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. పశుసంవర్ధక శాఖ స్టాల్ లో వివిధ పశువులకు సంబంధించిన 70 రకాల మేతలను ప్రదర్శించారు. ప్రభుత్వం విద్యార్ధులకు అందిస్తున్న వివిధ పథకాల గురించి తెలియజేసే విధంగా స్టాల్ ఏర్పాటు చేశారు. వీటిలో ఉధ్యాన శాఖ, డి అర్ డి ఎ-మెప్మా, మత్స్యశాఖ స్థాల్స్ ప్రధమ, ద్వితీయ,తృతీయ బహుమతులు పొందాయి.
కార్యక్రమంలో డిఆర్ డిఎ పిడి ఆర్. విజయరాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా, ఉధ్యానశాఖ డిడి ఎస్. రామ్మోహన్,, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, ఐసిడిఎస్ పిడి పి. శారద,పశు సంవర్దకశాఖ జేడీ గోవిందరాజులు, విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ ఎడి రామ్ కుమార్, ఎపిఎంఐపి పిడి రవికుమార్, పరిశ్రమల కేంద్రం జిల్లా అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.