Close

ఈనెల 11వ తేదీ సోమవారం యధావిధిగా పీజీఆర్ఎస్ మరియు రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ 1100 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు, స్థితి తెలుసుకోవచ్చు

Publish Date : 10/05/2026

ఏలూరు, మే, 10 : ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో ఈనెల 11వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా స్థాయిలో యధావిధిగా పిజి ఆర్ ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల స్థితి తదితర సమాచారం తెలుసుకోవాలంటే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
ఇప్పటివరకు జిల్లా స్థాయిలో అమలవుతున్న ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను ప్రభుత్వం ఇప్పుడు వికేంద్రీకరించిందని, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సేవలను ఈ నెల 11 వ తేదీ సోమవారం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను సమీప మండల కార్యాలయాల్లో, డివిజనల్ కార్యాలయాల్లో, లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా సమర్పించుకోవచ్చన్నారు.

అలాగే, ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు, ప్రభుత్వం అందించిన అధికారిక వెబ్‌సైట్:
🔗 https://meekosam.ap.gov.in
ఈ వ్యవస్థ వల్ల ప్రజల సమస్యలు తక్షణమే సంబంధిత అధికారులకు చేరి, సమయానుకూలంగా పరిష్కారమవుతాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు గుర్తించి పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు