Close

ఈనెల 23వ తేదీన జరిగే గ్రూపు-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. గ్రూపు-2 పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించిన జెసి, జిల్లా కో-ఆర్డినేషన్ అధికారి పి. ధాత్రిరెడ్డి..

Publish Date : 21/02/2025

ఏలూరు, ఫిబ్రవరి, 21: జిల్లాలో ఈనెల 23న ఎపిపిఎస్ సి ఆధ్వర్యంలో జరుగు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని జాయింట్ కలెక్టర్, గ్రూపు-2 పరీక్షల జిల్లా కో-ఆర్డినేషన్ అధికారి పి. ధాత్రిరెడ్డి పేర్కొన్నారు.

శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లో జెసి ఛాంబర్ లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులు, లైజన్ అధికారులు,పరీక్షల కేంద్రం యొక్క చీఫ్ సూపరింటెంట్లు, పోలీసు అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈనెల 23వ తేదీ ఆదివారం నిర్వహించే గ్రూపు-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల సమాచారం నిమిత్తం సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఆరోజున ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, నిరంతర విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంపులు ప్రతి పరీక్షా కేంద్రం నందు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సెక్షన్ 163 ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. ఏలూరు జిల్లాలో గ్రూపు 2 పరీక్షలు సజావుగా నిర్వహించడానికి సంబంధిత అధికారులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ వారి సూచనలు ప్రకారం పనిచేయాలని ఆమె ఆదేశించారు. గ్రూపు- 2 పరీక్షల సమాచారం నిమిత్తం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేయడమైనదన్నారు.
అభ్యర్ధులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే 9912244293, 80085 39786 ఫోన్ నెంబర్ల లో సంప్రదించవచ్చన్నారు.