ఈనెల 6వ తేదీన ఏలూరులో జిల్లా స్థాయి ‘స్వచ్చాంధ్ర అవార్డుల’ పంపిణీ- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
Publish Date : 05/10/2025
ఏలూరు, అక్టోబర్, 5 : ఈనెల 6వ తేదీ ఏలూరులో జిల్లా స్థాయిలో ‘స్వచ్చాంధ్ర అవార్డులు’ సాధించిన వారికి అవార్డులు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఈనెల 6వ తేదీ సోమవారం ఏలూరు సర్. సి.ఆర్.రెడ్డి డిగ్రీ కాలేజ్ ఆడిటోరియం లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ‘స్వచ్చాంధ్ర అవార్డులు’ సాధించిన వ్యక్తులు, సంస్థలను సన్మానించి, అవార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు.