ఈనెల 7వ తేదీ నుండి 21 వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.
ఏలూరు, జూన్, 4 : ఈనెల 7వ తేదీ నుండి 21 వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఈనెల 7వ తేదీ నుండి 21 వతేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు సంబంధించి యోగ ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీ లు, ఆధ్యాత్మిక ప్రాంతాలలో యోగా కార్యక్రమాలు, వాకదాన్, తదితర కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ ఏ తేదీలలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనే విషయంపై నివేదిక సమర్పించాలన్నారు.
నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసిందని, ప్రభుత్వం సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 7వ తేదీన ప్రారంభ కార్యక్రమం, 21వ తేదీన జిల్లా స్థాయిలో పెద్దఎత్తున ప్రజలతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఈనెల 11 వ తేదీన ద్వారకా తిరుమలలోని హరిత హోటల్ లోను, 12వ తేదీన పోలవరం మండలం పట్టిసీమలో ప్రజలతో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో సమాజంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, సమగ్ర శిక్షా ఏపిడి పంకజ్ కుమార్, పర్యాటక అధికారి పట్టాభి రామయ్య, ప్రభృతులు పాల్గొన్నారు.