Close

ఈ రోజు ఉదయం గం. 10:30 కు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ వి.ఆర్.క్రిష్ణ తేజ మైలవరపు గారిని ఆయన కార్యాలయంలో కలిసారు.

Publish Date : 20/11/2025

ఈ రోజు ఉదయం గం. 10:30 కు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ వి.ఆర్.క్రిష్ణ తేజ మైలవరపు గారిని ఆయన కార్యాలయంలో కలిసారు. జిల్లాలోని పలు ముఖ్య సమస్యలు, నిధుల విడుదల, పెండింగ్ బిల్లులు, రహదారుల మరమ్మత్తులు వంటి ప్రజా ప్రయోజన అంశాలను కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లి విపులంగా చర్చించారు.
చైర్‌పర్సన్ గారు ప్రధానంగా క్రింది అంశాలను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లారు:
1. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా – ZP రోడ్ల మరమ్మత్తులకు నిధుల విడుదల
• ఇటివలి కురిసిన వర్షాలకు జిల్లాలోని అనేక ZP రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్నాయని, వాటి మరమ్మత్తులు చేపట్టడం అత్యవసరమని తెలిపారు.
2. Satya Sai CPWS – O&M బిల్లులు మరియు విద్యుత్ చార్జీల భర్తీ
• సత్యసాయి సమగ్ర రక్షిత తాగునీటి పథకం కోసం గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు మరియు వివిధ CPWS స్కీంల విద్యుత్ బిల్లుల రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించారు.
3. Non-Provincialised Pensioners కు పెండింగ్ బకాయిలు
• జిల్లా పరిషత్ పరిధిలోని Non-Provincialized పింఛను దారులకు మరియు వారి కుటుంబాలకు జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుండి పించను చేల్లిస్తున్నాము అని, దని వాల్ల జిల్లా పరిషత్ కు భారంగా ఉన్నదని. వారి పించను ప్రభుత్వం 010 పద్దు నుండి చెల్లింపు చేయు విధంగా చర్యలు చేసుకోవాలని కోరారు.
4. ZPTC సభ్యుల గౌరవ వేతనం – అక్టోబర్ 2022 నుండి పెండింగ్
• ZPTC సభ్యులకు గడచిన దీర్ఘకాలంగా గౌరవ వేతనం విడుదల చేయకపోవడంతో వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారు జిల్లాలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నందున గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని కమిషనర్‌ను అభ్యర్థించారు.

5. గ్రామీణ తాగునీటి చెరువులకు ఫెన్సింగ్ మరియు ఇన్లెట్–అవుట్‌లెట్ ఏర్పాటు
తాగునీటి చెరువుల చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల
• అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయి
• చెరువులకు ఆత్మహత్యల కోసం వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది మరియు ప్రమాదకర మరణాలు జరుగుతున్నాయి అని.
• పశువులు నీటిలోకి వెళ్లి నీటిని కలుషితం చేస్తున్నాయి
అదే విధంగా, కొన్ని చెరువులలో చేప చెరువుల నుండి వస్తున్న కాలుష్య నీరు కలవడం వల్ల తాగునీరు ప్రభావితం అవుతోందని వివరించారు. అందువల్ల అన్ని గ్రామీణ తాగునీటి చెరువులకు ఫెన్సింగ్, ఇన్లెట్, అవుట్‌లెట్ ఏర్పాటు అత్యవసరమని తెలియజేశారు.
6. జిల్లా పరిషత్ హైస్కూల్స్, DLDO కార్యాలయాలు, జిల్లా పరిషత్ కార్యాలయంలో పోస్టుల మంజూరు
• నాన్ టీచింగ్ సిబ్బంది లేని ZP హైస్కూల్స్‌కు అవసరమైన జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, పరిపాలనాధికారి పోస్టుల మంజూరు
• DLDO కార్యాలయాలకు అవసరమైన సిబ్బంది పోస్టుల ఆమోదం
• జిల్లా పరిషత్ కార్యాలయానికి అకౌంట్స్ ఆఫీసర్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టుల మంజూరు
ఈ పోస్టుల బదులుగా జిల్లా పరిషత్ సమాన సంఖ్య గల పోస్టులను సరెండర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కమిషనర్ గారు అన్ని అంశాలను శ్రద్ధగా విని, సంబంధిత శాఖలతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు చైర్‌పర్సన్ గారు తెలిపారు.
జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం జిల్లా పరిషత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని చైర్‌పర్సన్ గారు తెలిపారు.