Close

ఉంగుటూరు మండలంలో ధాన్యం కొనుగోలు ని పరిశీలించి రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ

Publish Date : 01/05/2026

ఏలూరు/ఉంగుటూరు, మే, 1 : జిల్లాలో ధాన్యం కొనుగోలు లో ఏ రైతుకైనా సమస్య ఎదురైతే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 18004256453 నెంబర్ కి లేదా హెల్ప్ డెస్క్ నెంబర్ -7702003584 కి ఫోన్ చేసి తెలియజేస్తే పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం. జె. అభిషేక్ గౌడ చెప్పారు. ఉంగుటూరు మండలంలోని నారాయణపురం, చేబ్రోలు, తల్లాపురం లలో ధాన్యం ఆరబెట్టే ప్రదేశాలను శుక్రవారం సందర్శించి అక్కడ రైతులతో వారి సమస్యలను జేసీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా 1. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. 58 లక్షల గొనె సంచులను రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినకుండా ఉండేందుకుగాను, రైతు సేవ కేంద్రాల వద్ద టార్పాలిన్లు సిద్ధంగా ఉంచామని, రైతులు వాటిని వినియోగించుకోవాలన్నారు. ఉంగుటూరు మండలం లో 53,485 మెట్రిక్ టన్నుల ధాన్యమును మరియు నారాయణపురం & 2 కొనుగోలు కేంద్రాల ద్వారా 3745 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఉంగుటూరు మండలంలో 157 వాహనాలను రిజిస్ట్రేషన్ చేసి మరియు 16,93,747 గోనె సంచులు అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతుల యొక్క ధాన్యమును బద్రపరుచుటకు 325 టార్పాలిన్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. హమాలీలు, వాహనాలను, గోనె సంచులు కూడా రైతులు వారి సొంతం గా ఏర్పాటు చేసుకున్నట్లైతే గోనె సంచుల కోసం వినియోగ రుసుము రూ.4.47/- హమాలీల కొరకు క్వింటాలుకు రూ.24.06 లు చొప్పున చెల్లించడం జరుగుతుందని, అదేవిధంగా వాహనాల ఏర్పాటు కొరకు ప్రభుత్వ నిబంధనల మేరకు చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులు తాము కోరుకున్న మిల్లుకు ధాన్యం పంపుకోవచ్చన్నారు.
అనంతరం కైకరం లోని రైతు సేవా కేంద్రాన్ని జేసీ సందర్శించి, రైతులకు అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
జేసీ వెంట పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి . శివరామమూర్తి, జిల్లా సహకార శాఖాధికారి ఆరిమిల్లి శ్రీనివాస్, తహసీల్దార్ పూర్ణ ప్రసాద్, ప్రభృతులు పాల్గొన్నారు.