Close

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోండి అందుకోసం కష్టపడి చదవండి ఇష్టపడి చదివితే బంగారు భవిష్యత్తుకు బాట వేసినట్టే..- విద్యార్థినీ, విద్యార్థులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

Publish Date : 22/04/2025

ఏలూరు/బుట్టాయిగూడెం ఏప్రిల్ 22, : ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకోసం కష్టపడి చదవాలని ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు మీకు సొంతమవుతుందని జిల్లా కలెక్టర్కె. వెట్రిసెల్వి అన్నారు. బుట్టాయిగూడెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టరు మంగళవారం ఆకస్మికంగా సందర్శించి, విద్యార్థినీ,విద్యార్థులతో కె.వెట్రిసెల్వి మమేకమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, మాట్లాడుతూ ఇష్టపడి చదువుకుని విద్యలో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుని లక్ష్యాలను సాధించగలరని అన్నారు. తాము చదువుకున్న రోజుల్లో చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డామని,మీరు చదువుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యతో పాటు ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థి దశలోనే బాధ్యతలు ఉండవని మీ బాధ్యతలను మీ తల్లిదండ్రులు మోస్తూ మిమ్మల్ని ఉన్నత విద్యావంతులను చేసే లక్ష్యంతో కష్టపడడం జరుగుచున్నదని మీరు ఆలోచన చేయాలన్నారు. మిమ్మల్ని విద్యావంతులు చేసినందుకు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని, ఈ విషయాన్ని గుర్తుంచుకుని వారి కలలను సాకారం చేసే బాధ్యత మీ అందరి పైన ఉందని జిల్లా కలెక్టరు నొక్కి చెప్పారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో గ్రహించి ఆ సబ్జెక్టులపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని అన్నారు. చదువుతోపాటు భవిష్యత్తును ఏలా మలుచుకోవాలి, పదవ తరగతి తర్వాత ఏ కోర్సులు చదివితే ఏ ఏ అవకాశాలు ఉంటాయి తదితర విషయాలను తరచూ పిల్లలకు తెలియజేయాలన్నారు. ఉపాధ్యాయులు ద్వారా తెలియజేస్తేనే విద్యార్థులకు చక్కగా బోధపడుతుందని తెలిపారు.సోషల్ మీడియాకు, సెల్ ఫోన్లకుకు దూరంగా ఉండాలని, ఇంటర్నెట్ ఉన్నత విద్యకు ఉన్నత విలువలకు ఉపయోగించాలని అన్నారు. విద్యార్థులకు తల్లి,తండ్రి, దైవం అన్ని గురువే అని అటువంటి మహత్తర అవకాశం ఉపాధ్యాయులకు ఉందని అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి పాఠశాలలో తరగతి గదులను, పరిసరాలను, మరుగుదొడ్లను, ల్యాబ్ లను,
తదితర వాటిని జిల్లా కలెక్టరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,నాన్ టీచింగు సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.