ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు బడుగు, బలహీన వర్గాలు జీవనోపాధికి ఆర్థిక భద్రతతో గౌరవo కలిగించే సంక్షేమ పథకం.
ఏలూరు/ నూజివీడు, ఫిబ్రవరి: 28: నూజివీడు మండలం సుంకొల్లు, ముక్కెళ్లపాడు గ్రామంలో శనివారం నిరుపేదలు సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి వారి యోగక్షేమాలను, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, గ్రామాల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పింఛన్ల సొమ్మును లబ్ధిదారులకు అందజేసారు. ముందుగా గ్రామస్తులు ఘనస్వాగతం పిలిచారు. మహిళలు మంగళహారతులను ఇచ్చి మంత్రి కొలుసు పార్థసారథి నుదుటన కుంకుమతిలకం దిద్దారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు బడుగు, బలహీన వర్గాలు జీవనోపాధికి ఆర్థిక భద్రతతో గౌరవo కలిగించే మంచి సంక్షేమ పథకం అన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు 2,57, 658 మందికి రూ 113.09 కోట్ల రూపాయిలు పంపిణీకి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. పెన్షన్లు లబ్ధిదారులు సమాజంలో చిరునవ్వులతో జీవిస్తూ రేపటి అవసరాలు కోసం కొంత సొమ్మును పొదుపు చేసుకోవాలని సూచించారు. మార్చి 01వ తేదీ సెలవు దినం వలన లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదని ఒక రోజు ముందుగానే పింఛన్ల సొమ్ము పంపిణీకి కూటమి ప్రభుత్వం మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకుని అమలు చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దశలు వారీగా కాకుండా ఒకేసారి పెంచి, మూడు నెలలు ఏరియర్స్ కలిపి ఒకే సారి పంపిణీ చేశామని తెలిపారు. సమాజంలో గౌరవప్రదమైన జీవనాన్ని గడపాలని బెడ్ రెస్టు తీసుకుంటున్న వారు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కుల వృత్తిదారులు మరియు ఇతర చేనేత, మత్స్యకార బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతినెలా మొదటి తారీఖునే ఇంటింటికి వెళ్ళి పింఛన్ల ఆర్థిక సాయంవల్ల కనీస జీవన భద్రత, బరోసా లభిస్తుందన్నారు. సామాజిక రక్షణ బలోపేతం కావాలని ఉద్దేశంతో పింఛన్లను కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఆత్మగౌరవంతో కుటుoబంపై పూర్తిగా ఆధారపడకుండా పింఛన్లు సాయం ఎంతో దోహదపడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక ప్రయోజనాలను పెంచుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దారు జి.బద్రు, యంపిడివో సి.హెచ్. రాఘవేంద్రనాథ్, వివిధ శాఖలు అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల ప్రముఖులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.