Close

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 06/02/2025

ఏలూరు, ఫిబ్రవరి,6: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

గురువారం స్ధానిక కలెక్టరేట్ లోని విసి సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తో కలిసి సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తిచేయ్యాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా అమలయ్యేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆయా అధికారుల వారీగా వారు నిర్వర్తించే విధులను కలెక్టర్ వివరించారు. ఎన్నికల పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లను చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అనుభవజ్ఞులతో ఈనెల 12వ తేదీ, 22వ తేదీ శిక్షణా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. మైక్రో అభ్జర్వర్లు కూడా శిక్షణ అందించాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను పకడ్బంధీగా నిర్వహించాలన్నారు. ఈ విషయంలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు ఉండాలన్నారు. వట్లూరు సర్. సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కశాళాలలో ఏర్పాటుచేసే రిసెప్షన్ సెంటర్లో అవసరమైన లైటింగ్ ను సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయా జిల్లాలనుండి వచ్చే బ్యాలెట్ బాక్సులను, ఇతర రాజ్యాంగబద్ధమైన పత్రాలను స్వీకరించిన అనంతరం స్టాంగ్ రూమ్ లో భధ్రపరచాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సిసి కెమేరాల ఏర్పాట్లు చేయాలన్నారు. మార్చి 3వ తేదీన నిర్వహించే కౌంటింగ్ కు సంబంధించి సూపర్ వైజర్లు తదితర ఓట్ల లెక్కింపు సిబ్బంది నియామకాలను పూర్తిచేసుకోవాలన్నారు. వీరికి అవసరమైన శిక్షణను ఈనెల 17న అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ సెంటర్ లో అవసరమైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఓ లను కలెక్టర్ ఆదేశించారు. త్రాగునీరు, టాయిలెట్ల వసతి సౌకర్యాలను, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో మీడియా రూమ్ ఏర్పాట్లపై కూడా సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ ని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏర్పాట్లను జిల్లా అగ్నిమాపక అధికారి పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల పరిశీలకుల ఏర్పాట్లను ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ కేంద్రాలతో పాటు ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద అవసరమైన బంధోబస్తు ఏర్పాట్లను చేయాలన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఒక సవాల్ గా తీసుకొని సజావుగా, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా కృష్ణ -గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల సంబంధించి ఏర్పాట్లు కూడా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు.

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13వతేదీన నామినేషన్ల కు ఉపసంహరణకు గడువు, 27న ఉదయం 8 గం. నుండి సాయంత్రం 4 గం. వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.

సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఎస్పీ శ్రావణ్ కుమార్, డిటిసి కె.ఎం.ఎస్.వి. కృష్ణారావు, జిల్లా పౌర సరఫరాల సంస్ధ మేనేజరు వి. శ్రీలక్ష్మి, జిల్లా అగ్నిమాపక అధికారి సిహెచ్ రత్నబాబు, ఎల్టిఎం డి. నీలాధ్రి మున్సిపల్ కమీషనరు ఎ. భానుప్రతాప్, డిఎంహెచ్ఓ డా. ఆర్. మాలతి, తహశీల్దారు జి.వి. శేషగిరి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, తదితరులు పాల్గొన్నారు.