Close

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసివుంచాలి.మ్మెల్సీ ఎన్నికల సందర్బంగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసివుంచాలి.

Publish Date : 24/02/2025

ఏలూరు, ఫిబ్రవరి,24: ఈనెల 27వ తేదీన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏలూరు జిల్లా పరిధిలో పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసివుంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ఛీప్ ఎలక్ట్రోరల్ అధికారి ఉత్తర్వులు జారీచేసినట్లు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు జిల్లా పరిధిలో పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను, బార్లను ఈనెల 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు డ్రై డేగా పాటించి తప్పనిసరిగా మద్యం దుకాణాలను మూసిఉంచాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.