ఎరువుల సరఫరాలో రైతుల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటుచేయాలి- ఎరువుల సరఫరాపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్
ఏలూరు, జూన్, 15 : ఎరువుల సర ప్రభుత్వం రూపొందించిన ఫరాపై రాష్ట్రఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థా (ఏపిఏఐఎంఎస్) విధానంపై జిలాల్లోని రైతులందరికీ అవగాహన కలిగించి, ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం సాయంత్రం జిల్లాలో ప్రస్తుత వ్యవసా సీజన్లో ఎరువుల సరఫరాపై అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల సరఫరాలో ఏ ఒక్కరైతు నుండి ఫిర్యాదు రాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వం రూపొందించిన రాష్ట్రఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థా (ఏపిఏఐఎంఎస్) విధానంపై జిలాల్లోని రైతులందరికీ అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో 375 రైతు సేవా కేంద్రాలున్నాయని, ప్రతీ రైతు సేవా కేంద్రం పరిధిలోని రైతులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి ఏపిఏఐఎంఎస్ విధానంపై డీలర్లకు, ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ప్రతినిధులకు అవగాహన కలిగించాలన్నారు. ఎరువుల సరఫరాపై రైతుల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటుచేసి, కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ ను రైతులకు తెలిసేలా ఆర్ ఎస్ కె లు, పిఏ సిఎస్ ల వద్ద ప్రదర్శించాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎరువుల నిల్వలు ముందుగానే గుర్తించి ఇండెంట్ పెట్టెలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, వ్యవసాయ అనుబంధ రంగ శాఖల అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.