ఏలూరులో ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల పంపిణీని పరిశీలించిన టూరిజం డైరెక్టర్ కె.ఆమ్రపాలి..
Publish Date : 01/07/2025

ఏలూరు, జూలై, 01: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్.టి.ఆర్. భరోసాపించను పంపిణీ అమలుతీరును మంగళవారం జిల్లా ప్రత్యేక అధికారి మరియు టూరిజం డైరెక్టర్, కె. ఆమ్రపాలి పరిశీలించారు. ఏలూరు నగరంలోని పత్తేబాద మరియు ఎస్సీ నివాసిత ప్రాంతంలో పించను పంపిణి కార్యక్రమములో ఆమె పాల్గొని పలువురు లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్.టి.ఆర్. భరోసా పధకం కింద ఏటా సుమారు రూ. 33,600 కోట్లు సామాజిక పెన్షన్ల కోసం ప్రభుత్వం ఖర్చుచేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
వీరి వెంట డిఆర్డిఏ పిడి ఆర్ విజయరాజు, నగర మున్సిపల్ కమిషనర్ ఎ. భానుప్రతాప్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.