Close

ఏలూరు జిల్లాలో ఆగష్టు 1వ తేదీన 2,54,579 మంది ఫించన్ దారులకు 112.43 కోట్ల రూపాయిలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.

Publish Date : 31/07/2026

ఏలూరు, జూలై , 31 : ఏలూరు జిల్లాలో ఆగష్టు 1వ తేదీన 2,54,579 మంది ఫించన్ దారులకు 112.43 కోట్ల రూపాయిలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసాపించను పధకము కింద ఆగష్టు, 1వ తేదీ ఉదయం 7 గంటల నుండి అందించడం జరుగుతుందన్నారు.
ఏలూరు జిల్లా లో ఆగష్టు,2026 నెలలో 2,54,579 మంది ఫించన్ దారులకు 112.43 కోట్ల రూపాయిలు పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లా లో ఫించన్ లు పంపిణీ 1 వ తేదీన 100 శాతం పంపిణీ చేయుటకు చర్యలు తీసుకొనటం జరుగుతుందన్నారు. . అనివార్య కారణం ల చేత 1 వ తేదీన తీసుకోని వారికి 2వ తేదీ న పంపిణీ చేస్తారని, జిల్లా లో 4954 మంధి సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది తో ఫించనల పంపిణీకి ఏర్పాటులు చేయడమైనదన్నారు. పింఛను పొందేందుకు పింఛను దారులు వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారం అందించాలని, సచివాలయ సిబ్బంది ద్వారా ఉదయం 7.00 గంటల నుండి పించను పంపిణి జరిగే విధముగా చర్యలు తిసుకోనవలసినదిగా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.