ఏలూరు జిల్లాలో గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జరీ చేసిన జి.ఓ. నెంబర్ 13,తేదీ. 21. 1. 2025 ననుసరించి మొత్తం 14 షాపులను లాటరీ విధానంలో కేటాయించారు. గౌడ్ సామజిక వర్గానికి 2, గౌడ సామజిక వర్గానికి 4 షాపులు, శెట్టిబలిజ సామజిక వర్గానికి 8 షాపులు కేటాయించారు.
ఏలూరు, జనవరి, 24 : ఏలూరు జిల్లాలో గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జరీ చేసిన జి.ఓ. నెంబర్ 13,తేదీ. 21. 1. 2025 ననుసరించి మొత్తం 14 షాపులను లాటరీ విధానంలో కేటాయించారు. గౌడ్ సామజిక వర్గానికి 2, గౌడ సామజిక వర్గానికి 4 షాపులు, శెట్టిబలిజ సామజిక వర్గానికి 8 షాపులు కేటాయించారు. లాటరీలో విధానాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎక్సయిజ్ శాఖ అధికారులు, సంబంధిత సామజిక వర్గాలకు చెందిన వారి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి లాటరీ విధానంలో కేటాయించారు. గౌడ్ సామజిక వర్గానికి నూజివీడు మున్సిపాలిటీ పరిధిలోని షాపు, చింతలపూడి రూరల్ ప్రాంతంలోని షాపులు , గౌడ సామజిక వర్గానికి ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్, టి. నర్సాపురం, దెందులూరు, జంగారెడ్డిగూడెం రురల్ పరిధిలో షాపులు, శెట్టిబలిజ సామజిక వర్గానికి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, చింతలపూడి,చాట్రాయి,ముసునూరు, మండవల్లి, నిడమర్రు, అగిరిపల్లి, కొయ్యలగూడెం మండలాల పరిధిలోని షాపులను కేటాయించారు. లాటరీ విధానం పూర్తి పారదర్శకతతో జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు
ఎక్సయిజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీలత మాట్లాడుతూ జనవరి 25వ తేదీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, జనవరి 27 నుండి దరఖాస్తు, ఆన్లైన్, హైబ్రిడ్ విధానాలు ద్వారా రూ.2 లక్షలు దరఖాస్తు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుకు గడువు ఫిబ్రవరి 5 సాయంత్రం 5.00 గంటల వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 6న దరఖాస్తుల పరిశీలన అనంతరం, ఫిబ్రవరి 7 ఉదయం 10.00 గంటలకు లాటరీ పద్ధతి ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేసి షాపులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య ,జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఆర్. నాగరాణి, ఎక్సయిజ్ శాఖ సిఐ లు, ఎస్ ఐ లు, గౌడ్, గౌడ, శెట్టిబలిజ సామజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు, పాల్గొన్నారు.