ఏలూరు జిల్లాలో గోదావరి పుష్కరాల సందర్భంగా సామాన్య భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
ఏలూరు, జూన్, 10 : ఏలూరు జిల్లాలో గోదావరి పుష్కరాల సందర్భంగా సామాన్య భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏలూరు జిలాల్లోని పుష్కర ఘాట్లకు చేరుకునే రోడ్డు మార్గాల పరిస్థితి, రోడ్ల వెడల్పు, మరమ్మత్తులు, వాహన పార్కింగ్ ప్రదేశాలు గుర్తింపు, తదితర అంశాలపై జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి కలెక్టర్ తో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సమయంలో ఏలూరు జిల్లాలో గోదావరి తీర ప్రాంతాలలోని పుష్కర ఘాట్లలో భక్తులు పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉందని, జిలాల్లోని వివిధ ప్రాంతాల నుండి పుష్కర ఘాట్లకు చేరుకునే రోడ్ల పరిస్థితి రోడ్ల వెడల్పు, మరమ్మత్తులు, వాహన పార్కింగ్ ప్రదేశాలు గుర్తింపు, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సమయంలో ఏలూరు జిల్లా నుండే కాక, ఇతర ప్రదేశాల నుండి కూడా పెద్దఎత్తున ప్రజలు పుణ్యస్నానాలు చేసేందుకు జిల్లాకు విచ్చేస్తారని, వారికి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేలా రోడ్లు వెడల్పు, మరమ్మత్తులకు సంబంధించి సమాచారం అందించాలని రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులను కోరారు. ఘాట్ల వద్దకు వాహనాలు ప్రవేశించేందుకు, బయటకు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు, ఘాట్ల వద్ద వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, ఆర్ అండ్ బి., పంచాయతీ రాజ్, ఇరిగేషన్ శాఖల ఎస్ఈ లు కె. విజయరత్నం, జెడ్. రమేష్, దేవప్రకాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.