Close

ఏలూరు జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణకు విద్యుత్ శాఖ తరపున జిల్లా, డివిజినల్ స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపెరింటెం

Publish Date : 19/10/2025

ఏలూరు, అక్టోబర్, 19 : ఏలూరు జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణకు విద్యుత్ శాఖ తరపున జిల్లా, డివిజినల్ స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాల్మన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1912 మరియు 9440902926 ఫోన్ నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయడం జరిగిందని, అదేవిధంగా ఏలూరు డివిజన్ లో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9440904037, జంగారెడ్డిగూడెంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9491030712 ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ సరఫరా, షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు సంభవించిన వెంటనే సహాయం కోసం టోల్ ఫ్రీ 1912 నెంబర్ తో లేదా పైన తెలిపిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లకు లేదా విద్యుత్ శాఖాధికారుల ఫోన్ నెంబర్ 9440812702, 9440812703, 9440812704, 9491049797 నంబర్లకు ఫోన్ చేస్తే వెంటనే సిబ్బంది నమోదు చేసుకుని సహాయ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఈ సల్మాన్ రాజు తెలియజేసారు.