Close

ఏలూరు జిల్లాలో నీట్ రీ ఎగ్జామ్స్ ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.

Publish Date : 21/06/2026

ఏలూరు, జూన్, 21 : ఏలూరు జిల్లాలో నీట్ రీ ఎగ్జామ్స్ ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. జిల్లాలో మొత్తం 6 కేంద్రాలలో పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 1674 మంది అభ్యర్థులకు గాను 1457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, 217 మంది పరీక్షకు హాజరుకాలేదన్నారు. ఏలూరు లో పి .ఎం. శ్రీ కేంద్రీయ విద్యాలయం, శ్రీ ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, కస్తూరిబా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల, గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాల, గోపన్నపాలెం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఎన్ టి ఏ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయన్నారు. జవాబు పత్రాలను భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలించడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సిసి టివిల పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలియజేసారు. జిల్లాలో నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన అధికారులు, సిబ్బందిని కలెక్టర్ వెట్రిసెల్వి ఈ సందర్భంగా అభినందించారు.