Close

ఏలూరు జిల్లాలో ప్రజలకు ఉచిత ఇసుక మరింత అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.

Publish Date : 08/01/2025

ఏలూరు, జనవరి, 8: ఏలూరు జిల్లాలో ప్రజలకు ఉచిత ఇసుక మరింత అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. ఉచిత ఇసుకకు ఎటువంటి కొరత లేకుండా ప్రజలకు డిసిల్టింగ్ పాయింట్లలో మరింత ఉచిత ఇసుక అందుబాటులో ఉంచేందుకు అధికారులు పరిశీలించాలన్నారు. ఏలూరు జిల్లాలోని గూటాల-1, గూటాల -2, పట్టిసీమ డిసిల్టింగ్ పాయింట్లలో ఇసుకను అందుబాటులో ఉంచడంతోపాటు, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని చిడిపి , ఔరంగాబాద్ ఇసుక రీచ్ లను ద్వారా ఇసుక సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందన్నారు. వీటి ద్వారా ప్రజలకు ఉచిత ఇసుక అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, గనులు శాఖ డిడి బి.రవికుమార్, ఉప రవాణా కమీషనర్ కరీం ,ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్, జిల్లా పంచాయతీ అధికారి కె. అనురాధ, పర్యావరణ శాఖ ఈఈ వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం రవాణాధికారి, ఇరిగేషన్ శాఖల అధికారులు ప్రభృతులు పాల్గొన్నారు.