ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)- 2026 ప్రక్రియలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను హెచ్చరించారు.
ఏలూరు, సెప్టెంబర్, 5 : ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)- 2026 ప్రక్రియలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శనివారం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)- 2026, పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ, స్థానిక సంస్థల ఎన్నికలు, తదితర అంశాలలపై ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ, తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)- 2026 ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన కామవరపుకోట, ఉంగుటూరు, కొయ్యలగూడెం, టి. నర్సాపురం, నూజివీడు పురపాలక సంఘ ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ జేసీ డిఆర్ఓ ను ఆదేశించారు. ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలపై ఫారం-6, 7, 8 దరఖాస్తులు 10 వేల 769 దరఖాస్తులు అందాయని, వాటిలో 8189 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని, పెండింగ్ లో ఉన్న 2580 దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల తుది జాబితా తయారీపై ఆమోదించిన జాబితాను పరిశీలించి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల లాగిన్ కి పంపాలని ఆదేశించారు. అక్టోబర్ నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు సంబంధించి 37 గ్రామాలలో నిర్వహించిన రీసర్వే వివరాల ప్రకారం భూ విస్తీర్ణం, యజమాని పేరు, తదితర వివరాలు సరిచూసుకుని, లోపాలు లేని వివరాలతో, రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.
నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ లు లక్ష్మి ప్రసన్న, రమణ, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్ఓ, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.