ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి..
ఏలూరు, జనవరి,26: 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత మహాత్మాగాంధీ, డా. బి.ఆర్. అంభేద్కర్ లకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశసమగ్రతా, సమైఖ్యతలకు కృషి చేయాలన్నారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన భారత స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాన్ని మరియు కృషిని మనం గుర్తుచేసుకున్నట్లే మన దేశ కీర్తిని గుర్తు చేసుకునే రోజు అని ఆమె పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంభేద్కర్ నేతృత్వంలో రచించిన మన దేశ రాజ్యాంగం ప్రపంచంలో ఎంతో విశిష్టత కలిగివుందన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఆర్డివో అచ్యుత అంబరీష్, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్. రాజు, పౌరసరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి, బి.సి. కార్పోరేషన్ ఇడి ఎన్. పుష్పలత, జిల్లా బిసి సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవికాదేవి, కె. భాస్కర్, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, కలెక్టరేట్ వివిధ విభాగాల పాల్గొన్నారు.