ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుంచి ప్రజలకు దగ్గరగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేస్తున్న నేపథ్యంలో ఇంచార్జి ఐటీడీఏ పీ.వో గా పని చేస్తున్న జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి

ఏలూరు/బుట్టాయిగూడెం, నవంబరు, 13: ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుంచి ప్రజలకు దగ్గరగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేస్తున్న నేపథ్యంలో ఇంచార్జి ఐటీడీఏ పీ.వో గా పని చేస్తున్న జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న అన్ని గ్రామాలలో బాల బాలికలకు పుస్తకలు ప్రదర్శన కొరకు మొబైల్ బోధి బస్సును ఏర్పాటు చేసి ఏజెన్సీ లో ఉన్న అన్ని మండలాలను ఉన్న గ్రామాలలో బోధి బస్సు ద్వారా పిల్లలకు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గూడెం గ్రామంలో బోధి బస్సు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో చిన్న పిల్లలకు మొబైల్ బస్సు పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేసి సదరు పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలను గురించి బాల బాలిక లకు తెలియ చేసి చిన్న పిల్లలకు అర్థమై బాషలో పుస్తకాల్లో ఉన్న చిన్న చిన్న కథలు గురించి జెసి పి. దాత్రి రెడ్డి , జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ , జాయింట్ కలెక్టర్ చిన్న పిల్లలతో మమేకమై వారితో వారి యొక్క ఆశయాలను గురించి ప్రతి ఒక్క బాల బాలికను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రెడ్డి గూడెం గ్రామ కాపురస్తులు కొంతమంది వారి గ్రామంలో స్కూల్ నిర్మాణానికి సహాయం చేయమని జాయింట్ కలెక్టర్ గారిని అభ్యర్థించ గా వారు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారలను అందిస్తానని హామీ ఇచ్చారు. వీరితో పాటుగా పోలవరం డిఎస్పీ వెంకటేశ్వరరావు పోలవరం ఇన్స్పెక్టర్ బాల సురేష్ బాబు , ఐటీడీఏ ఏపీవో నాయుడు , స్ధానిక తహశీల్దారు, ఐటీడీఏ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు , ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.