Close

ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులైన జి.వి.కె. మల్లికార్జునరావు బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ వెట్రిసెల్వికి పూలమొక్కను అందించి డిపిఓ మల్లికార్జునరావు మర్యాదపూర్వకంగా

Publish Date : 03/06/2026

ఏలూరు, జూన్,3 : ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులైన జి.వి.కె. మల్లికార్జునరావు బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ వెట్రిసెల్వికి పూలమొక్కను అందించి డిపిఓ మల్లికార్జునరావు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని గ్రామాలలో ఎక్కడా రోడ్డులపై చెత్త లేకుండా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని, గ్రామాలలో పాలన సక్రమంగా సాగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ మల్లికార్జునరావును ఆదేశించారు.
జి.వి.కె మల్లికార్జునరావు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎంపిడిఓ గా పనిచేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో డివిజినల్ డెవలప్మెంట్ అధికారి హోదాలో డ్వామా ఏ పి డి గా పనిచేస్తూ ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిగా బదిలీపై నియమింపబడ్డారు.