ఏలూరు, జూన్, 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఈనెల 21 వ తేదీ ఉదయం 6 గంటలకు ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జే. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించార
పత్రికా ప్రకటన ఏలూరు, జూన్, 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఈనెల 21 వ తేదీ ఉదయం 6 గంటలకు ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జే. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై శనివారం సాయంత్రం అధికారులతో జేసి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసి అభిషేక్ గౌడ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు 21 వ తేదీ ఉదయం 6 గంటలకే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతున్న దృష్ట్యా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని 6 గంటలకు ప్రారంభించాలని, ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో 3 వేల మందికి పైగా ప్రజలతో యోగాభ్యాసాలు ప్రారంభించాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. యోగా పై జిల్లా స్థాయి లో నిర్వహించిన వ్యాసరచన, ఫోటో, క్విజ్, వీడియో, స్లోగన్లు, తదితర పోటీలలో గెలుపొంది, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 23 మందికి ఈ సందర్భంగా సన్మానించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రివర్యులు పాల్గొనే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాలు ద్వారా వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు వంటి ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని జేసి అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. వర్షం వచ్చే సూచనలు ఉంటే ప్రత్యామ్నాయ సభా వేదికలు ముందుగానే గర్తించి, ఏర్పాట్లు చేయాలన్నారు.
ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, సబ్ కలెక్టర్ బి. వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓ లు లక్ష్మి ప్రసన్న, రమణ, డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ భానుప్రతాప్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, సమగ్రశిక్ష ఏపిడి పంకజకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.