Close

ఏలూరు/దెందులూరు /పెదపాడు, మే, 19: రీసర్వే పై రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.

Publish Date : 19/05/2026

ఏలూరు/దెందులూరు /పెదపాడు, మే, 19: రీసర్వే పై రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. దెందులూరు నియోజవర్గంలో వట్లూరు, కొవ్వలి, తదితర గ్రామాలలో మంగళవారం రీసర్వే పనులను జేసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి అభిషేక్ గౌడ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా రీసర్వే పనులు చేయాలన్నారు. సంబంధిత భూముల రైతులకు నోటీసులు ఇచ్చి రీసర్వే చేపట్టాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేని భూమి రికార్డులు రూపొందించాలన్నారు. భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. జేసి వెంట సంబంధిత మండలాల తహసీల్దార్లు, సర్వే అయిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.