ఏలూరు విచ్చేసిన ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ జిల్లా కలెక్టర్, ఎస్ పి లతో కలిసి అధికారులతో సమావేశం

ఏలూరు,డిసెంబర్, 27:సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ శుక్రవారం ఏలూరు చేరుకుంది. తొలుత ఏలూరు కలెక్టరేట్ కు విచ్చేసిన ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రాకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.పి శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి స్వాగతం పలికి పూల మొక్కలను అందజేశారు.ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో అధికారులతో ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు సంబంధించి జిల్లా అధికారులతో కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి ఆయా శాఖల వారీగా పూర్తి సమాచారాన్ని వెంటనే కమిషన్ కు సమర్పించాలన్నారు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా సమాచారాన్ని సకాలంలో సమర్పించాలన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులతో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వారికి ఆయన సూచించారు. జిల్లాలో ఆయా శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలకు అమలు చేసిన , చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఉపకులాల వారీగా సమాచారాన్ని అందించాలన్నారు.మెయిల్ omcscsubclassification@
gmail.com ద్వారా 2025 ద్వారా కూడా సమర్పించవచ్చు అన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ కె . వెట్రిసెల్వి ,జిల్లా ఎస్పి కె.పి .శివ కిషోర్, జిల్లా అధికారులు జిల్లా రెవిన్యూ అధికారి
వి.విశ్వేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ వి. జయప్రకాష్ జడ్పీ సీఈవో కె.సుబ్బారావు, డిఆర్డిఏ పిడి డాక్టర్ ఆర్.విజయరాజు, డీఈవో వెంకట లక్ష్మమ్మ, డ్వామా పిడి సుబ్బారావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎస్.రామ్మో మోహన్ రావు, డిఎస్ పి డి.శ్రావణ్ కుమార్,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.